Oasis Fertility : భారతదేశంలో విశ్వసనీయ ఫర్టిలిటి కేర్ చెయిన్ గా పేరు పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ మంత్ గా వేడుక చేసుకుంటోంది. అందులో భాగంగా మదర్స్ డేని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల పాటు 30 పట్టణాల్లో ‘ఒయాసిస్ జనని యాత్ర’ పేరిట ఉచిత మొబైల్ ఫర్టిలిటి క్యాంప్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య ఎం మరియు ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క క్లినికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీపిక మరియు ఇతర ప్రముఖులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేట్లు 1.7కి తగ్గడంతో – భర్తీ పరిమితి 2.1 కంటే చాలా తక్కువగా – వంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ తరచుగా విస్మరించబడే ప్రజారోగ్య సమస్యగా మారింది. చాలా కుటుంబాలకు, సంతానోత్పత్తి చికిత్సను పొందడం అంటే సుదూర నగరాలకు ప్రయాణించడం, ఈ ప్రయాణం ఆర్థిక ఒత్తిడిని మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు రవాణా సవాళ్లను కూడా తెస్తుంది, ముఖ్యంగా చికిత్స చాలా నెలలుగా కొనసాగినప్పుడు. ఇంటికి దగ్గరగా అందుబాటులో ఉన్న, అధిక-నాణ్యత సంతానోత్పత్తి సంరక్షణ యొక్క అత్యవసర అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది.
దీనికి స్పందనగా, ‘ఒయాసిస్ జనని యాత్ర’ అనేది ప్రజల్లో తరచూ నిర్లక్ష్యం చేయబడే సంతానలేమి కారణాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న అవగాహన కార్యక్రమం, జీవనశైలి మార్పులు చేసుకోవాల్సిన తక్షణావసరంపై ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచనుంది. ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద అత్యాధునిక సదుపాయాలతో కూడిన మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ హైదరాబాద్ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు పర్యటించనుంది. పునరుత్పత్తి (ఫర్టిలిటి) ఆరోగ్యంపై కీలక సంభాషణలు ప్రజల్లో చోటు చేసుకునేలా చేస్తుంది. ఈ యాత్ర అనుభవం కలిగిన సంతాన సాఫల్య నిపుణులతో ఉచిత సంప్రదింపులతో పాటు మహిళలకు ఉచిత ఏఎంహెచ్, హీమోగ్లోబిన్ టెస్టులను మరియు పురుషులకు ఉచిత వీర్య విశ్లేషణలు అందించనుంది- సురక్షిత, పరిశుభ్రమైన శాంపుల్ కలెక్షన్ జోన్లను సంస్థ ఏర్పాటు చేసింది.

ముఖ్యంగా సంతానలేమిపై ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించనుంది. వయస్సు, ఒత్తిడి, ఆహారం, నిద్ర, పర్యావరణ విషతుల్యాలు, పిల్లలు పుట్టడంలో జాప్యం వంటి అంశాలపై అవగాహన పెంచనుంది. పురుషులలో వంధ్యత్వ సమస్యలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశాలలో ఒకటి. ఆధునిక కాలపు ఒత్తిళ్లు, జీవనశైలి, పోషకాలు సరిగా తీసుకోకపోవడం, కాలుష్యాలకు గురి కావడం, డిజిటల్ ఉపకరణాలను పరిమితికి మించి ఉపయోగించడం లాంటివన్నీ దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. సంతానలేమి కేసుల్లో మగవారి అంశాలే 40-50% దాకా ఉంటున్నప్పటికీ, దాన్ని మాత్రం ప్రజలు చాలా తక్కువగానే అర్థం చేసుకున్నారు. సమాజంలో ఉన్న అపోహలు, అవగాహన లోపం కారణంగా ఈ అంశాన్ని విస్మరిస్తున్నారు.
సైన్స్ ఆధారిత సమాచారాన్ని నేరుగా ప్రజలకు అందించడం ద్వారా ఒయాసిస్ జనని యాత్ర ప్రజల్లో ఉన్న అపో హలను తొలగించనుంది. జీవనశైలి సంబంధిత సంతానరాహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో స్త్రీ, పురుషులకు ఈ అంశంపై సాధికారత కల్పించనుంది. వారు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చేలా చేస్తుంది. బహుముఖ కార్యాచరణ మరియు పటిష్ఠ రీతిలో ప్రభుత్వ సంస్థలతో కలసి పని చేయడం ద్వారా ఈ కార్యక్రమం సహానుభూతి, ఎవిడెన్స్ బేస్డ్ సంతాన సాఫల్య పరిష్కారాలు మార్కాపురం వంటి ఈ తరహా సేవలు అంతగా అందని ప్రాంతాలకు చేరుకునేలా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో సంతాన సాఫల్య చికిత్సకు యాక్సెస్ పొందడం, అవగాహన లాంటి వాటిలో ఎంతో అంతరం ఉంది.
ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య ఎం మాట్లాడుతూ, “జీవనశైలి కారకాలు మరియు ఆలస్యమైన కుటుంబ నియంత్రణ కారణంగా సంతానోత్పత్తి సవాళ్లు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అనేక టైర్ 2 మరియు 3 పట్టణాలలో, పరిమిత అవగాహన మరియు ప్రత్యేక సంరక్షణకు ప్రాప్యత ఆలస్యంగా రోగ నిర్ధారణ మరియు చికిత్సకు దారితీస్తుంది. ఒయాసిస్ జనని యాత్ర ద్వారా, పునరుత్పత్తి శాస్త్రంలో తాజా పురోగతుల ద్వారా శక్తిని పొంది, నిపుణుల సంతానోత్పత్తి సంరక్షణ మరియు విద్యను నేరుగా పేద వర్గాలకు తీసుకురావడం ద్వారా మేము దీనిని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది చికిత్స గురించి మాత్రమే కాదు – ఇది తల్లిదండ్రుల వైపు వారి ప్రయాణంలో జంటలకు విశ్వాసాన్ని పెంపొందించడం మరియు బలమైన మద్దతు వ్యవస్థను అందించడం గురించి, ఇవన్నీ వారు నిజంగా సైన్స్ చేతుల్లో ఉన్నారని నిర్ధారించుకుంటూనే.”
ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీపిక మాట్లాడుతూ, ‘‘సంతానలేమి అనేది ఇకపై ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదు. పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత ఆందోళన కూడా. పీసీఓడీ, తల్లిదండ్రులు కావడంలో జాప్యం, ఒత్తిళ్లు వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నసిస్ ఎంతో ముఖ్యం. ఒయాసిస్ జనని యాత్ర ద్వారా మేం నిపుణుల సంరక్షణను, అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతీ గుమ్మం వద్దకు తీసుకెళ్లగలుగుతు న్నాం, మరీ ముఖ్యంగా ఈ తరహా సదుపాయాలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లో. తద్వారా సకాలం లో వారికి అండగా నిలుస్తూ, తల్లిదండ్రులం కావాలనే కోరిక ఫలించేలా చేస్తున్నాం. అవగాహనను అందుబాటుతో మిళితం చేయడం ద్వారా, ఆయా వ్యక్తులు తమ పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోగలిగేలా సాధికారికతను అందిస్తున్నాం’’.
ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండడం, సైన్స్ ఆధారిత సంరక్షణపై ఒయాసిస్ ఫెర్టిలిటీ అంకిత భావాన్ని చాటిచెబుతుంది. మేం విస్తృతశ్రేణి సంతానలేమి సవాళ్లను సక్రమంగా నిర్వహించి, లక్షకు పైగా ఆరోగ్యవంతమైన శిశువుల జననానికి కారణమయ్యాం. ఛాఫా-ఈవం వంటి వినూత్నతలను ఉపయోగించడం ద్వారా, సంక్లిష్ట కేసుల్లో సైతం మేం అధిక సక్సెస్ రేటును అందించగలుగుతున్నాం. మీరు ఇప్పుడు గానీ లేదా కొంతకాలం తరువాతైనా గానీ శిశువును పొందాలని భావిస్తుంటే, ఆలస్యం చేయవద్దు – సత్వర అవగాహన, ఆచరణ ముఖ్యం. ఒయాసిస్ ఫెర్టిలిటీ లో మీరు ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ ఉంటారు, తల్లిదండ్రులు కావాలనే కలను నిజం చేసుకునేందుకు ఓ మార్గం పొందగలుగుతారు. జనని యాత్రలో చేరండి, ఇక్కడ ప్రతి ప్రయాణం కూడా ఒక ఆశతో మొదలవుతుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి:
2009లో ఏర్పాటు చేయబడిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, భారత్ లో ఇది 19 నగరాల్లో 31 కేంద్రాలను కలిగిఉంది. తన అధిక ఐవీఎఫ్ సక్సెస్ రేటుకు పేరొందిన ఒయాసిస్ 1,00,000కు పైనా చిన్నారులను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులకు సాయపడింది. స్త్రీ, పురుషులకు విస్తృత శ్రేణికి చెందిన ఫెర్టిలిటీ కేర్ సేవలను అందిస్తున్న ఒయాసిస్, మెడికల్ కౌన్సెలింగ్, డయాగ్నసిస్ మొదలుకొని ఐవీఎఫ్, ఐయూఐ, ఐసీఎస్ఐ వంటి అధునాతన చికిత్సలతో పాటు ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. సమగ్ర ధోరణికి కట్టుబడిన ఒయాసిస్ శారీరక, భావోద్వేగ, ఆర్థిక ఆందోళనలను పరిష్కరించుకోవడంలో తోడ్పడుతోంది. చికిత్స ఫలితాలు మెరుగయ్యేలా థెరపీలు, పోషక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తుంది.