బాలీవుడ్ కష్టాలకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్లకి పైగా కలెక్ట్ చేసిన పఠాన్ సినిమాతో తన కంబ్యాక్ కి రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జవాన్’. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈరోజు షూటింగ్ పార్ట్ కి చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టేసారు. ఇకపై దాదాపు రెండు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని చేసి ఇప్పటికే అనౌన్స్ చేసిన జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు… నయనతారతో పాటు దీపికా పదుకొణె, ప్రియమణి, సునీల్ గ్రోవర్ మరియు యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: Radhika Apte: 14 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అవతారం ఎత్తిన సాధారణ హౌజ్ వైఫ్