యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు నిర్మాత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ‘ఖిలాడీ’ నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మకు ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ రేంజ్ రోవర్ వెలార్ అనే మోడల్ కారు విలువ రూ. 1.15 కోట్లు. దీన్నిబట్టి సినిమా విజయంపై టీం ఎంత నమ్మకంగా ఉందో తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
Read Also : వైరల్ పిక్ : ముంబై ఎయిర్ పోర్ట్ లో వెంకీమామ
‘ఖిలాడి’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది.