యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు నిర్మాత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ‘ఖిలాడీ’ నిర్మాత కోనేరు సత్యనారాయణ డైరెక్టర్ రమేష్ వర్మకు ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ రేంజ్ రోవర్ వెలార్ అనే మోడల్ కారు విలువ రూ. 1.15 కోట్లు.…