Keerthy Suresh reveals intresting information about chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ రిలీజ్ కు రెడీ అవుతొంది.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తుండగా రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది.ఈ క్రమంలో ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Mr Pregnant Trailer: మగాడు ప్రెగ్నెంట్ అయితే?
ఈ క్రమంలో భోళా శంకర్ లో చిరంజీవికి సిస్టర్ గా కనిపించడం ఎలా అనిపించింది ? అని అడిగితే చాలా ఆనందంగా వుందని చెప్పుకొచ్చింది. రజనీకాంత్ గారితో సినిమా పూర్తిచేసిన తర్వాత భోళా శంకర్ ఆఫర్ వచ్చిందని అన్నారు. . మెగాస్టార్, సూపర్ స్టార్ అనే ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ తో నటించానని, ఇంతకంటే ఏం కావాలి అని ఆమె ప్రశ్నించింది. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉందని, అలాగే భోళాలో మరో గొప్ప విశేషం ఏంటంటే చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దొరికిందని అన్నారు. గతంలో చిరంజీవి గారితో ఒక్క ఫ్రేమ్ లోనైనా డ్యాన్స్ చేయాలని ఉండేది కానీ ఇందులో రెండు పాటల్లో డాన్స్ చేసే అవకాశం దొరికిందని ఆమె అన్నారు. చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో నటించారని పేర్కొన్న ఆమె అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పిందని అన్నారు.
చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్ లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పిందని చాలా కేరింగ్ గా చూసుకునేవారని కీర్తి చెప్పుకొచ్చారు. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చింది, అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు.. చిరంజీవి రియాక్షన్ నాకు చాలా సర్ప్రైజ్ చేసిందని అన్నారు. ‘’మీ అమ్మగారు ఇంతే చెప్పిందా .. నేను తనతో ఇంకా చాలా చెప్పాను’ అన్నారని, అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకు గుర్తు ఉందని అన్నారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. అయితే‘మీ అమ్మ చాలా అమాయకురాలు, నువ్వు మాత్రం అలా కాదు, స్వీట్ అండ్ స్మార్ట్ నువ్వు’ అని చిరంజీవి గారు అన్నారని చెప్పుకొచ్చింది.