Mr Pregnant Trailer Launched by Nagarjunga: ‘బిగ్ బాస్’ ఫేమ్ హీరో సయ్యద్ సొహైల్ రియాన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సోహైల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సరికొత్త కాన్సెప్ట్ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోందని సినిమా యూనిట్ కొద్దిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నాగార్జున ఒక స్పెషల్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ అయితే ఆసక్తికరంగా సాగింది. ‘’నా పేరు గౌతమ్, నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్ అంటూ ట్రైలర్ మొదలవగా అందరి లైఫ్ లో ఉండేదే బ్రో, కానీ నా లైఫ్ లో ఓ ట్విస్ట్ అంటూ అసలు విషయం బయట పెడతాడు.
SIIMA 2023: బెస్ట్ యాక్టర్ అవార్డు బరిలో చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా రచ్చ తప్పదుగా!
హి ఇజ్ మిస్టర్ ప్రెగ్నెంట్ అని సుహసిని చెప్పడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. అలా నవ్విస్తూనే సాగిన ట్రైలర్ ను ఎమోషనల్ గా కూడా చూపించారు. ఒక మగ వ్యక్తి ప్రెగ్నెంట్ అవ్వడంతో.. సొసైటీ ఎలా చూస్తుంది? ఎలా అవమానిస్తుంది అనేది చూపించారు. ఎవరు ఏం అనుకున్నా నా బేబీ కోసం నేను ఉంటానని చెప్పి గౌతమ్ కష్టపడటం, బాధపడటం కనిపిస్తుంది. ఈ సినిమాలో సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అందిస్తుండగా మైక్ మూవీస్ బ్యానర్పై నిర్మాతలు అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.