Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర మూవీ రేపు జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగార్జున, ధనుష్ కాంబోలో వస్తున్న మొదటి మూవీ. పైగా రష్మిక కూడా ఉంది. పేద, ధనిక వర్గాల బేధాలు, వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. రొటీన్ రొట్టకొట్టుడు కథ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని మూవీ టీమ్ హైప్ ఇస్తోంది. ట్రైలర్ చూస్తే కొత్త రకమైన కథ అని అర్థం అవుతోంది. దీంతో మూవీకి అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జోరుగా నడుస్తున్నాయి.
ఈ మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. మూవీ స్టార్ట్ చేసినప్పుడు యావరేజ్ సినిమా బడ్జెట్ అనుకున్నారు. కానీ సీన్స్ మేకింగ్ ను బట్టి బడ్జెట్ పెంచుకుంటూ పోయారు. మొత్తంగా రూ.150 కోట్ల దాకా బడ్జెట్ అయింది. శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.47 కోట్ల దాకా వచ్చాయని నిర్మాత సునీల్ నారంగ్ తెలిపారు. మూవీ థియేట్రికల్ రైట్స్ ను అన్ని ఏరియాల్లో కలిపి రూ.65 కోట్లకు అమ్మేశారు. ఇక కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు వస్తే మూవీ గట్టెక్కుతుంది.
Read Also : Rashmika : ‘రష్మిక సెంటిమెంట్’ కుబేరకు కలిసొస్తుందా..?
అంటే రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. లేదంటే కష్టమే. కుబేర మూవీకి ఉన్న బజ్, నాగార్జున, ధనుష్ కు ఉన్న సౌత్ మార్కెట్ ను బట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా అదేమంత పెద్ద కష్టం కాదు. పైగా పెద్ద సినిమాల పోటీ కూడా లేదు. కుబేర వచ్చిన వారం తర్వాత కన్నప్ప వస్తోంది. ఆ లోగా కుబేర బ్రేక్ ఈవెన్ అవడానికి పెద్ద టైమ్ పట్టదు. పైగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ మీద సౌత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తో వచ్చిన హైప్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కనిపిస్తోంది.
పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం పాజిటవ్ టాక్ వస్తే చాలు మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తుందని టీమ్ చెబుతోంది. పైగా దిల్ రాజు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాల పాజిటివ్ సపోర్ట్ మూవీకి కనిపిస్తోంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఒకవేళ యావరేజ్ టాక్ వచ్చినా భారీ నష్టాలు ఉండవు. ఇలా ఎటు చూసుకున్నా కుబేర గట్టెక్కే అవాకశాల కనిపిస్తున్నాయి.
Read Also : UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు..