Keerthi Bhat: స్టార్ మా ఛానెల్ లో మానసిచ్చి చూడు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి భట్. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ తరువాత పలు షోస్ లో పాల్గొనడం.. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన విషాదం తెలుసుకొని ఫ్యాన్స్ ఆమెను మరింతదగ్గరకు తీసుకున్నారు. ఓకే కారు యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలిచింది కీర్తి. ఆస్తి కోసం బంధువులు మీద పడినా.. తట్టుకొని నిలబడింది. ఇక కార్తీక దీపం సీరియల్ తో అందరి కంట్లో పడడమే కాకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా రాబట్టింది. ఆ హౌస్ లో తన ఒంటరితనాన్ని వదిలి మంచి స్నేహితులను సంపాదించుకుంది. ఇక కొన్ని రోజుల క్రితమే ఆమె హీరో కార్తీక్ తోట ప్రేమలో పడింది. ఈ కుర్ర హీరో కన్నడ, తెలుగులో కూడా రెండు మూడు సినిమాల్లో నటించాడు. ఇక కీర్తిని మొదటిసారి చూసి ప్రేమలో పడిన కార్తీక్ తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
Sudigali Sudheer: ఒక విరాట్.. ఒక రాజమౌళి.. ఒక సుడిగాలి సుధీర్.. అదిరిన ‘గోట్’ గ్లింప్స్
ఇక ఒక షో లో తన అత్తమామలు ఎంత మంచివారో కీర్తి చెప్పుకొచ్చింది కారు ప్రమాదంలో తగిలిన దెబ్బల వలన తనకు పిల్లలు పుట్టరని తెలిసినా వారు తనను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారని, తనకు వారు అత్తమామలు కాదని, తల్లిదండ్రులు అని చెప్పుకొచ్చింది. ఇక కార్తీక్, కీర్తి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం ఆమె నిశ్చితార్థంలో సందడి చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం హల్చల్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కీర్తి కి మంచి కుటుంబం దొరికిందని, ఆమె సంతోషంగా ఉండాలని అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కీర్తి మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తోంది.