Keerthi Bhat: స్టార్ మా ఛానెల్ లో మానసిచ్చి చూడు అనే సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి భట్. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సీరియల్ తరువాత పలు షోస్ లో పాల్గొనడం.. ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన విషాదం తెలుసుకొని ఫ్యాన్స్ ఆమెను మరింతదగ్గరకు తీసుకున్నారు. ఓకే కారు యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలిచింది కీర్తి.