బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9 న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయినప్పటి నుండి ఈ జంట తమ వేడుకల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆదివారం కత్రినా, విక్కీ వారి మెహందీ, సంగీత్ వేడుకలకు సంబంధించిన వరుస చిత్రాలను పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో కత్రినా విక్కీతో కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. మరొకదానిలో ఆమె విక్కీ తండ్రి షామ్ కౌశల్‌తో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తూ కన్పిస్తోంది. విక్కీ పంచుకున్న చిత్రాలలో ఒకటి ఈ జంట భాంగ్రా మూవ్ చేస్తున్నప్పుడు క్లిక్ చేయబడింది. శనివారం ఈ జంట తమ హల్దీ వేడుక నుండి ఫోటోలను పంచుకున్నారు. శుక్రవారం వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
Read Also : కూలెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి… లిస్ట్ లో ఏకైక భారతీయుడు జక్కన్నే !
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో విక్కీ, కత్రినా పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు హల్దీ, సంగీత్, వివాహ వేడుకలు జరిగాయి. పెళ్లికి దాదాపు 120 మంది అతిథులను ఆహ్వానించారు. చిత్రనిర్మాత కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథుర్, నటి నేహా ధూపియా, ఆమె భర్త అంగద్ బేడీ, అనుష్క-విరాట్ తదితర సెలెబ్రిటీలు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.





