Karthik Subbaraj strong counter to a journalist about Nimisha Sajayan: ఓ తమిళ జర్నలిస్ట్ అడిగిన అర్ధంలేని ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో నిమిషా సజయన్ లుక్‌పై ఒక జర్నలిస్ట్ కొన్ని కామెంట్స్ చేశారు. వ్యాఖ్యానించాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో రాఘవ లారెన్స్ పక్కన ఈ మలయాళ నటి నటించింది. ఇటీవల చెన్నైలో జరిగిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సక్సెస్‌మీట్‌లో నిమిషా సజయన్ లుక్‌పై కామెంట్స్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు సినిమాలో రెండు ప్రధాన పాత్రలు పోషించిన రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అందం గురించి ఓ జర్నలిస్టు చేసిన కామెంట్ల పట్ల కార్తీక్ సుబ్బరాజ్ కౌంటర్ ఇచ్చిన తీరును పలువురు అభినందిస్తున్నారు.
Balakrishna: విజయ్-రష్మికల రిలేషన్ పై బాలయ్య జోకులు
ఓ జర్నలిస్టు అడిగిన అర్ధంలేని ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ ఘాటుగా స్పందించాడు. సక్సెస్ మీట్ సందర్భంగా, రాఘవ లారెన్స్‌కి జోడీగా నిమిషా సజయన్‌ను ఎలా తీసుకున్నారని డైరెక్టర్‌ని ఒక రిపోర్టర్ అడిగాడు. తన తొలి తమిళ చిత్రం చితా(తెలుగులో చిన్నా)లో ఆమె అందంగా కనిపించనప్పటికీ ఆ నటి ఆకట్టుకునేలా నటించిందని, చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ.. నిమిషా ఎందుకు అందంగా లేదని విలేకరిని ఎదురు ప్రశ్నించారు. బహుశా మీ ఆలోచనా విధానం కావచ్చు, ఎవరైనా అందంగా లేరని మీరు చెప్పలేరు, ఇది చాలా తప్పుడు ఆలోచన , ఇది దాదాపు బాడీ షేమింగ్ తో సమానమని కూడా కార్తీక్ అన్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ సమాధానం చాలా మంది హృదయాలను గెలుచుకుంది, చాలా మంది పరిశ్రమ ప్రజలు అతనిని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.