Balakrishna makes fun on Rashmika – Vijay Devarakonda relationship: రష్మిక మందన, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది ఎవరికీ తెలియదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత దాని వారి ఖండించారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాగ్రౌండ్ ఒకలాగే కనిపిస్తూ ఉండటంతో వారు ఒకచోటే ఉంటున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది. ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విజయ్ దేవరకొండ రష్మిక మందన రిలేషన్ గురించి జోకులు వేయడం హాట్ టాపిక్ అవుతుంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపుల్ విత్ ఎన్ బి కె మూడవ సీజన్ రెండవ ఎపిసోడ్లో యానిమల్ టీం అతిధులుగా హాజరయ్యారు.
Purandeshwari: అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉంది..
ఈ క్రమంలోనే రష్మికచేత విజయ్ దేవరకొండకు ఒక ఫోన్ చేయించాడు బాలకృష్ణ. దానికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేయగా ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అర్జున్ రెడ్డి పోస్టర్ తో పాటు యానిమల్ పోస్టుర్ వేస్తే ఇందులో ఎవరు బెటర్ హీరో అని చెప్పమని రష్మీకని అడిగితే రష్మిక చెప్పలేక సిగ్గుపడుతున్నట్లుగా ప్రోమోలో చూపించారు. రష్మిక విజయ్ తో ఫోన్ మాట్లాడుతుండగా అన్నమయ్య బాలకృష్ణ స్పీకర్ పెట్టించి ఈ టెర్రస్ పార్టీలు ఏంటి గురు అని అడగటం ఆ తర్వాత ఐ లవ్ రష్మిక అని విజయ్ దేవరకొండకు చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది.. T-సిరీస్, సినీ1 స్టూడియోస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది.