టాలీవుడ్ సీనియర్ హీరోలలో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న హీరో ఎవరైన ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే. ఒక వైపు సినిమాలు మరోవైపు టాక్ షోస్ మరోవైపు పొలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు బాలయ్య. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో హిట్ అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ హిట్స్ డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 షూటింగ్ దశలో ఉంది.
అయితే బాలయ్య ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీని రిజెక్ట్ చేసారు. ఆ పాన్ ఇండియా సినిమానే జాట్. సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ క్యారక్టర్ కోసం బాలయ్యను అనుకున్నారు. గతంలో బాలయ్యతో వీర సింహారెడ్డి వంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడంతో బాలయ్య ను గెస్ట్ రోల్ లో నటింపచేసేందుకు ట్రే చేశాడట గోపీచంద్. కాని బాలయ్య సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చేయగా ఈ సినిమా బాలయ్య కు బాగా సెట్ అవుతుందనే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా చేసి ఉంటె బాలయ్యకు పాన్ ఇండియాలో ఎంట్రీ ఈజీగా ఉండేది. కానీ చిన్నరోల్ కావడంతో బాలయ్య నో చెప్పాడని ఇన్ సైడ్ టాక్.