Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో రికార్డు గురించి మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Read Also : Vijay Devarakonda : కారులోనే శృంగారం చేశా.. విజయ్ షాకింగ్ కామెంట్స్
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కాంతార నిలిచిపోయిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇది తమకు దక్కిన అరుదైన గౌరవం అంటూ తెలిపింది మూవీ నిర్మాణ సంస్థ. కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది.
Read Also : Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్