Rashmika : రష్మిక చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు దీన్ని. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయితో మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో చిన్మయి ఓ రాపిడ్ ఫైర్ ప్రశ్న వేసింది. బ్రేకప్ అయితే అబ్బాయిలే ఎక్కువ బాధపడుతారు.. అమ్మాయిలు చాలా సింపుల్ గా మూవ్ ఆన్ అయిపోతారు నిజమేనా అని రష్మికను అడిగింది. దానికి రష్మిక కూడా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.
Read Also : Chiranjeevi : చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. నాగార్జున, వెంకీ హాజరు
అని ఎవరు చెప్పారు అసలు. మనం అంటే గడ్డాలు, మీసాలు పెంచుకోలేం. మందు తాగితే ఇంట్లో వాళ్లు ఊరుకోరు. అందుకే మన బ్రేకప్ బాధ ఎవరికీ కనిపించదు. కానీ అమ్మాయిలు అలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోరు. బ్రేకప్ అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఆన్సర్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ తర్వాత బ్రేకప్ చేసుకుంది. అంటే అతనితో బ్రేకప్ వల్ల రష్మికనే ఎక్కువ బాధపడిందా అని అడుగుతున్నారు అభిమానులు.
Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ నోట బలూచిస్థాన్.. నెట్టింట ఒకటే రచ్చ