Kannapa Trailer : మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మంచు విష్ణు. జూన్ 13న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఏ టైమ్ కు అన్నది అందులో స్పష్టంగా చెప్పలేదు. మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అంతా విష్ణు చుట్టూ కనిపించాయి. ప్రభాస్ కు సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే వదిలారు.
Read Also : Kannappa : మంచు విష్ణు ఓవర్ హైప్.. బెడిసికొడుతుందా..?
దీంతో ట్రైలర్ లో అయినా ప్రభాస్ ను చూడొచ్చిన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కూడా ఉండటంతో వారి ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం టీజర్ మాత్రమే వచ్చింది. పైగా విష్ణు మూవీకి భారీ హైప్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మూవీ ఎలా ఉంటుందో అని ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ట్రైలరే మూవీకి హైప్ పెంచాలి. ఒకవేళ ట్రైలర్ బాగోకపోతే మూవీకి హైప్ రాదు.
ఈ నడుమ సినిమాలు అన్నీ ట్రైలర్, టీజర్లతోనే హైప్ ను తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ను బట్టే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఒకవేళ ట్రైలర్ యావరేజ్ గా ఉంటే.. సినిమాకు అనుకున్న స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగట్లేదు. ఇన్ని రోజులు భారీ హైప్ ఇచ్చిన కన్నప్ప మూవీ.. ట్రైలర్ తో ఏ స్థాయి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
Read Also : Balakrishna : టాలీవుడ్ లో ఆ అరుదైన రికార్డు బాలయ్యదే..
13th June!#kannappa #harharmahadevॐ pic.twitter.com/BHcUzqIZZu
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2025