Balakrishna : టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణది సుదీర్ఘ ప్రయాణం. చిన్న వయసు నుంచే ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి యాక్షన్ సీన్లు చేస్తున్నారు. ఎలాంటి గెటప్ అయినా వేసేస్తున్నారు. పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చేసుకుంటున్నారు. మాస్ యాంగిల్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ బాలయ్య ఖాతాలోనే ఉంది. టాలీవుడ్ లో డ్యూయల్ రోల్స్ ఎక్కువ సినిమాల్లో చేసింది బాలయ్యనే.
Read Also : ‘OG’ : పవన్ కల్యాణ్ ‘OG’ లో జపనీస్ యాక్టర్..
17 సినిమాల్లో రెండు పాత్రలు చేశాడు బాలయ్య. ఇన్ని సినిమాల్లో ఎవరూ డ్యూయల్ రోల్స్ చేయలేదు. అలాగే బాలయ్య ఖాతాలో ఇంకో రికార్డు కూడా ఉంది. ఒకే ఏడాది ఎక్కువ హిట్స్ అందుకుంది కూడా బాలయ్యనే. 1987లో ఏడు సినిమాలు రిలీజ్ చేసి హిట్ అందుకున్నాడు. ఇంత భారీగా హిట్ కొట్టడం కేవలం బాలయ్యకే సాధ్యం అయింది.
పైగా ఎక్కువ మాస్ సినిమాల్లో నటించింది కూడా బాలయ్యనే. మాస్ ఫాలోయింగ్ లేకపోతే సినిమాల్లో ఎక్కువ కాలం కొనసాగలేమని అప్పట్లోనే గ్రహించాడు బాలయ్య. అందుకే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇప్పుడు అఖండ-2తో మరింత మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు. నిన్న రిలీజ్ అయిన టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది.
Read Also : Kingdom : కింగ్ డమ్ వాయిదా తప్పదా..?