Darsan:కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ హీరో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు కాబట్టి.. ఇక తాజాగా దర్శన్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శన్ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో దర్శన్ కు అదృష్ట దేవత గురించి ప్రశ్న ఎదురయ్యింది. అదృష్ట దేవత అన్ని సార్లు తలుపుతట్టదు. తట్టినప్పుడే మనం వాటిని అందుకోవాలని యాంకర్ అనగా.. దానికి దర్శన్ సమాధానమిస్తూ “అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు.. తలుపు తట్టినప్పుడు ఆమెను గదిలోకి లాకెళ్లి.. బట్టలు విప్పి నగ్నంగా చేయాలి. అప్పుడు ఆమె ఇంట్లోనే ఉండిపోతుంది. బట్టలు ఇస్తే అవి ధరించి బయటికి వెళ్ళిపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక దర్శన్ మాటలకు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అదృష్ట దేవత అంటే.. లక్ష్మీ దేవి.. మహా విష్ణువు భార్య.. అలంటి దేవతను పట్టుకొని బట్టలు విప్పాలి.. నగ్నంగా ఉంచాలి అంటావా అంటూ దర్శన్ ను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు కూడా ఒక స్త్రీని అందునా దేవతను అలంటి మాటలు అంటావా.. వెంటనే అతను దేవతకు, హిందువులకుక్షమించమని కోరాలి.. లేకపోతే పర్యవసానాలు వేరుగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.