Kanguva Movie to Postone : తమిళ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న కంగువ కోసం కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు ఫ్యాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైర్లు అవుతాను. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా “కంగువ” వాయిదా పడింది. ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10. అయితే, రజనీకాంత్ ‘వెట్టయన్’ ఆ తేదీని లాక్ చేయడంతో “కంగువ” టీమ్ మరో తేదీని ఎంచుకోవలసి వచ్చింది. అనేక సమీకరణాలను బట్టి లెక్కలు వేసుకున్న తర్వాత సినిమాని నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Vijay’s Last movie : తలపతి ఫాన్స్ గెట్ రెడీ!!
మొదట్లో, నిర్మాతలు “పుష్ప 2” వాయిదా గురించి ఊహాగానాల కారణంగా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయొచ్చు అనుకున్నారు.. అయితే కచ్చితంగా పుష్ప డిసెంబర్ 6న రావడం ఖాయమని మేకర్స్ తేల్చి చెప్పడంతో నవంబర్ 14వ తేదీని కొత్త తేదీగా ఎంచుకున్నారు. నిజానికి “కంగువ” వంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది సరైన తేదీ కాదు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో భారతదేశం అంతటా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ సినిమాకి హిందీ మార్కెట్ కీలకం కానుంది. శివ దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.