Vijay’s Last movie Annoucement Soon: తలపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని వార్తలు వస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి విజయ్ ఇప్పటి జివరకు 68 సినిమాలు చేశాడు. ఆయన ఇటీవల హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆయన హీరోగా ఇక సినిమాలు చేయరు అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయన చివరి సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఇప్పటికే రాజకీయ పార్టీ పెట్టాడు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రతి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తుంది.
2025 జూన్ నాటికి ఆయన తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టేందుకు సినిమాల్లో నటించడం పూర్తిగా ఆపేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన హీరోగా చేసే చివరి సినిమా #తలపతి69గా సూచించబడే అతని 69వ సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ శర వేగంగా జరుగుతోంది. హీరోయిన్ గా సమంత, సిమ్రాన్, మమితలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి గొడ్డు సినిమానే విజయ్ చివరి సినిమా అని అందరూ భావించారు ఆమె పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది కానీ వినోద్ సినిమా చివరి సినిమా ఏ అవకాశం ఉంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు.