Kangana Ranath: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది మాట్లాడినా వివాదమే.. ఏం చేసినా విమర్శలే. అందుకే ఆమె ఏం మాట్లాడుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఉంటున్నా బాలీవుడ్ కు వ్యతిరేకంగా ఉండే హీరోయిన్. ఆమె మనసుకు నచ్చింది ఏదైనా నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తోంది. ఇక మొదటి నుంచి కంగనాకు సౌత్ సినిమాలు అంటే మక్కువ ఎక్కువ.. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన ఈ భామ తాజాగా సీతారామం చిత్రంపై ప్రశంసలు కురిపించింది. సీతారామం సినిమాను వీక్షించి దానిపై రివ్యూ రాసుకొచ్చింది.
“ఎట్టకేలకు నాకు సీతారామం సినిమా చూడడానికి తీరిక దొరికింది. ఎపిక్ లవ్ స్టోరీ. హను రాఘవపూడి మీ అసాధారణమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం అద్భుతం.. ఇక ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెస్. ఇక మృణాల్ నటన గురించి ఏం చెప్పాలి. భారీ ఎమోషన్స్ ను, హుందాతనాన్ని ఒక పాత్రలోనే చూపించింది. ఈ పాత్రలో మరో నటిని ఉహించుకోలేము. మృణాల్ నువ్వు నిజంగానే రాణివి. ఠాకూర్ సాబ్ జిందాబాద్. ఇక నుంచి నీ రాజ్యం నడుస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ సినిమాలను ఏకిపారేసే ఈ భామ సౌత్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక కంగనా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఎమెర్జెన్సీ సినిమాలో నటిస్తోంది ఇందిరా గాంధీ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.