బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలను సమతూకంగా కొనసాగిస్తోంది. 2024లో భాజపా తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకురాలు అయినా పీరియడ్స్ సమస్యలు మాత్రం తప్పవు. ఈ విషయం గురించి చాలా మంది బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ తాజాగా కంగనా రనౌత్ మాత్రం తన అనుభవాలను బహిర్గతం చేస్తూ మహిళల వాస్తవ పరిస్థితిని చెప్పుకొచ్చారు.
Also Read : Raj Kundra : కిడ్నీ దానం వ్యాఖ్యలపై ట్రోల్స్‌కి కౌంటర్ ఇచ్చిన రాజ్ కుంద్రా
“సినిమా షూటింగ్‌ల్లో హీరోయిన్స్‌కి కారవాన్‌లు ఉంటాయి. అవుట్‌డోర్ షెడ్యూల్స్‌లో కూడా టీమ్ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. పీరియడ్స్ సమయంలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే వేడి నీరు, వాష్‌రూమ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో ఆ రోజులు కొంత సులభంగా గడుస్తాయి. కానీ రాజకీయ రంగం పూర్తిగా వేరు. పర్యటనల సమయంలో ఒక్కోసారి రోజుకు 12 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సందర్భంలో టాయిలెట్ సదుపాయం కూడా దొరకదు. ఇది నాకే కాదు.. ఇతర మహిళా ఎంపీలందరికీ ఉన్న సమస్యే. ఇది చిన్న ఇబ్బంది కాదు, పెద్ద విపత్తు తో పోల్చవచ్చు. దీన్ని వర్ణించడం కూడా చాలా కష్టం” అని ఆమె తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.