Kangana Ranaut Comments on Sandeep Reddy Vanga: ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ తో హిట్ కొట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే ఆయన గురించి హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లు తీసిన సందీప్ వంగా మూవీలో చేయాలని హీరో హీరోయిన్లు అందరూ క్యూ కడుతుంటే, కంగనా మాత్రం దయచేసి తనకు ఎలాంటి పాత్ర ఇవ్వవద్దని కోరుతూ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది.
Paris Jackson: గ్రామీ ఈవెంట్ కోసం 80 టాటూలు దాచేసిన మైఖేల్ జాక్సన్ కూతురు
ఎందుకంటే ఇటీవల సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంగనాతో కలసి పనిచేయాలని ఉందన్నాడు ఆ వీడియోని ఒకరు ట్వీట్ చేయగా కంగనా స్పందిస్తూ ట్వీట్ చేస్తూ, ‘సమీక్ష, విమర్శ రెండూ ఒకటి కావు, ప్రతి కళనూ సమీక్షించి చర్చించవలసిన అవసరం ఉంది, అది మామూలు విషయం. అయితే నా సమీక్ష పట్ల సందీప్ వంగా నవ్వుతూ స్పందించిన వైనం చాలా హుందాగా ఉంది.. అతని ప్రవర్తనలాగే, అందుకు ధన్యవాదాలు. అయితే మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి, ఒకవేళ ఇస్తే, మీ సినిమాల్లోని ఆల్ఫా మేల్ హీరోలంతా ఫెమినిస్టులు అయిపోతారు, అప్పుడు మీ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి అని అన్నారు. మీరు బ్లాక్ బస్టర్లు ఇవ్వాలి, ఇండస్ట్రీకి మీరు కావాలి’ అంటూ కంగనా ట్విట్టర్ లో కామెంట్ చేయగా అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.