Kangana Comments on Politics goes Viral: రాజకీయాల్లోకి రావాలని ఉందని కంగన రనౌత్ తన మనసులోని మాట బైటపెట్టింది. దీంతో కంగన పాలిటిక్స్‌లోకి వస్తోందంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. దేశం కోసం ఎంతో చేశానని..పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ లేకపోవడమనేది సేవ చేయడానికి అడ్డంకి కాదని పెద్ద లెక్చర్కూడా ఇచ్చింది కంగన. నిజానికి కంగన రనౌత్ కొన్నేళ్లుగా.. సినిమాల కంటే రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతోంది. దేశంలో ఏ ఉద్యమం వచ్చినా.. ఏ ఇష్యూ జరిగినా.. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపిస్తున్న క్రమంలో కంగన త్వరలో బీజేపీలో చేరుతోందని వస్తున్న కథనాలు అన్నిటినీ ఇప్పుడు నిజం చేసే పనిలో ఉంది. తాజాగా ఒక ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగన తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందిస్తూ.. రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఇదే సరైన సమయమని పేర్కొంది. సినిమా సెట్ నుంచి రాజకీయ పార్టీలతో పోరాడానని పేర్కొంది. తను నటిగా కంటే జాతీయవాదిగానే గుర్తింపు తెచ్చుకున్నానని, నార్త్ నుంచి వెళ్లి సౌత్‌లో ఎక్కువ సినిమా చేశానని..ఝాన్సీ రాణి వంటి పవర్ ఫుల్ రోల్స్ పోషించానని చెప్పుకొచ్చింది.
Rakul Preet Singh: రకుల్ సెకెండ్ ఇన్నింగ్స్.. ఫోకస్ అంతా అక్కడే?
దేశం తనకు చాలా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దేశానికి తిరిగి ఇవ్వడం తన బాధ్యత అంటోంది కంగన. నిజానికి ఇందిరాగాంధీకి విమర్శలు తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కాలం నాటి కథను సినిమాగా ఎంచుకుని ఎమర్జెన్సీ అనే పేరుతోనే కాంగ్రెస్ కి కొంత వ్యతిరేకంగా ఎమర్జెన్సీ సినిమాను నిర్మిస్తోంది కంగన. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతోపాటు… ఆస్తులమ్మి మరీ నిర్మిస్తోండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమధ్య ముంబాయ్‌లో వున్న రెండు ఫ్లాటులను అమ్మేసి ఈ కాంట్రవర్సీ మూవీలో ఇందిరాగాంధీగా నటిస్తూ.. బిజెపి అభిమానం సంపాదిస్తోంది కంగన. నిజానికి కంగన బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బిజెపి అధ్యక్షుడు నడ్డా అన్నమాట నిజమయ్యేలానే తాజాగా కంగన మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఇక రాజకీయాల్లో రావడానికి ఇదే సరైన సమయమని కంగన రనౌత్ పేర్కొన్నా ఆమె అంతిమ లక్ష్యం మాత్రం హిమాచల్ ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడమేనని అంటున్నారు. తెర మీద జయలలితగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇందిరా గాంధీగా ప్రధాన మంత్రి పాత్రలు పోషిస్తున్న ఆమె నిజ జీవితంలో ఏమవుతారో? కాలమే నిర్ణయించాలి మరి.