Rakul Preet Singh Focusing on Tollywood again: పరిస్థితులు మారుతున్నాయి, పెళ్లయిన తర్వాత కూడా హాట్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు.ఇప్పుడు ఇదే లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేరబోతోంది.సెకండ్ ఇన్సింగ్స్ లోనూ సత్తా చాటేందుకు పక్కాప్లాన్ రెడీ చేసుకుంటోంది రకుల్. ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచ్లర్ లైఫ్ కి పులుస్టాప్ పడింది.నిర్మాత జాకీ భగ్నానీతో ఏడు అడుగులు వేసింది.మరి రకుల్ ఇకపై సినిమాలు చేస్తుందా? లేక కుటుంబ జీవితానికే అంకితమవుతుందా? అంటే రకుల్ ఎప్పటిలాగే సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. పెళ్లి కి-కెరీర్ కి సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నిరూపించారు. ఐశ్వర్యారాయ్ నుంచి లావణ్య త్రిపాఠి వరకు అంతా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు.
Sharwanand: శర్వానంద్ తండ్రిగా స్టార్ హీరో?
ఇప్పుడు రకుల్ కూడా ఇదే లిస్ట్ లో చేరబోతోంది. నిజానికి పెళ్లికి ముందే రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉంటే మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త కథలకు సంబంధించి సంప్రదింపులను కూడా ఈ బ్యూటీ వేగంగా జరుపుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతానికి హనీమూన్ లో బిజీగా గడుపుతున్న ఈ భామ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో రచ్చ రేపడానికి రెడీ అవుతోంది. ఇక పెళ్లైన కొత్తలో రకుల్ యాక్టివిటీస్ ఈ రేంజ్ లో ఉంటే సినిమాలు చేయడకుండా ఆమెని ఎవరు ఆపగలరు? అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా సౌత్ ,నార్త్ ఇండస్ట్రీలో పెళ్లికాని భామలకంటే పెళ్లైన భామలకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. జాకీ భగ్నాని కూడా హీరో కం ప్రొడ్యూసర్ కావడం కూడా రకుల్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది.