Kamal Haasan: ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని చెప్పుకొనే హీరోలు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. కానీ ఈ ఏజ్ లో కూడా అదే చరిష్మా మెయింటైన్ చేస్తూ ఆయన పని అయిపోయింది అని అందరూ లైట్ తీసుకొనేలోపు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం లోక నాయకుడికే చెల్లింది. నటుడిగా, నిర్మాతగా, హోస్ట్ గా, బిజినెస్ మ్యాన్ గా, డైరెక్టర్, సింగర్.. ఒకటేమిటి అన్ని కళలను ఒడిసిపట్టిన హీరో కమల్ హాసన్. ఇటీవలే తన 68 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న కమల్.. మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. కమల్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ అంటూ క్లాతింగ్ బిజినెస్ లోకి దిగాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో షూట్ ను ఇటీవలే షూట్ చేయగా.. అందులో కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
విదేశీ భామల మధ్య కమల్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. విదేశీ భామలతో కమల్ మదన కామరాజు లీలలు అని కొందరు.. ఈ పోస్టర్స్ చూస్తుంటే అప్సరసల మధ్య మైఖెల్ మదన కామరాజుని చూసినట్టే ఉందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక కమల్ కెరీర్ విషయానికొస్తే విక్రమ్ హిట్ తో ఒక్కసారిగా జోరు పెంచిన లోక నాయకుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా తరువాత మరో కుర్ర డైరెక్టర్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట కమల్.. ఏదిఏమైనా కమల్ ను చూస్తుంటే నిజంగా ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అనిపించక మానదు.