Nandamuri Kalyan Ram: బింబిసార హిట్ తో జోరు పెంచేసిన కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 10 న రిలీజ్ ఉండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసేసారు మేకర్స్ ఇక్క తాజాగా అమిగోస్ ట్రైలర్ ను కర్నూల్ లో రిలీజ్ చేశారు.. కర్నూల్ లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ” బింబిసార లాంటి ఒక కొత్త సినిమాను తీసుకొచ్చి మీ ముందు ఉంచాం.. దాన్ని మీరు ఎంతో ఆదరించి హిట్ చేశారు. అందుకు నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు అమిగోస్ తో మీ ముందుకు వస్తున్నాను. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్ధం.. తాతగారు రాముడు భీముడు సినిమా చేశారు.. బాబాయ్ చేశారు.. తమ్ముడు జై లవకుశ చేశాడు. అలా ఆ సినిమాలు అన్నింటిలోనూ అన్నదమ్ముల కథ.. కానీ, ఇందులో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు కదా.. అందులో ముగ్గురు ఒకేచోట కలిస్తే.. ఎలా ఉంటుంది అనేదే ఈ కథ. సినిమా అద్భుతంగా వచ్చింది.
Amigos Trailer: నేను ఎవరిని బెదిరించను.. చంపేస్తా అంతే
ఘంటాపథంగా నేనొక విషయం చెప్తున్నాను. థియేటర్ కు వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో నిరాశ చెందరు. నా మీద ఉన్న నమ్మకానికి, మీరు మా మీద చూపించే అభిమానానికి ఇంకొక సూపర్ హిట్ సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 10 న ఈ సినిమా థియేటర్ లో రాబోతుంది. మీరందరు సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది.. తమ్ముడు వస్తున్నాడు. మిగతా విషయాలన్నీ ఆరోజు మాట్లాడుకుంటాను. మీ అభిమానం చూస్తుంటే మాటలు రావడం లేదు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఇంతమంది అభిమానాన్ని పొందుకున్నాం. మీ అందరికి జీవితాంతం రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.