Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు చేస్తున్న కొత్త ప్రయత్నమే అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మరో కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో కథను రివీల్ చేయకుండా జాగ్రత్త పడి ఆసక్తిని పెంచిన దర్శకుడు ట్రైలర్ లో కొద్దిగా కథను రివీల్ చేశాడు. ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తుల కలయిక ఎన్ని విధ్వంసాలను సృష్టించిందో చూపించడమే అమిగోస్ కథ అని తెలుస్తోంది.
Thalapathy67: బ్లడీ స్వీట్.. రక్తాన్ని ఏరులై పారించేలా ఉన్నారే
” హి ఈజ్ ఏ ఇండియన్ పాబ్లో ఎస్కోబార్.. నైట్ మెర్ టూ నేషనల్ సెక్యూరిటీ” అంటూ ఒక పోలీస్ అధికారి బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఒక మాఫియా డాన్, డ్రగ్ డీలర్ గా కళ్యాణ్ రామ్ కనిపించాడు. అతని పేరు బిపిన్.. చీకటి రాజ్యానికి రారాజు. అతని కోసం ఎన్నో దేశాల్లో పోలీసులు వెతుకుతూ ఉంటారు. వారి నుంచి తప్పించుకోవడానికి బిపిన్.. తనలానే ఉన్న మరో ఇద్దరినీ వెతికి పట్టుకొని వారితో కలిసి స్నేహం చేస్తాడు.. ఆ తరువాత ఒక్కొక్కరిగా వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. సాఫీగా సాగిపోయే వారిద్దరి జీవితాల్లో బిపిన్ ఎలాంటి తుఫాన్ రేపాడు..? ఆషికాను ప్రేమించిన కళ్యాణ్ రామ్ ఎవరు..? అసలు బిపిన్ కు తనలాగే ఉన్న మరో ఇద్దరితో ఉన్న బంధం ఏంటి..? చివరికి ఈ ముగ్గురు డూప్లగ్గర్స్ లో ఎవరు మిగిలారు..? బిపిన్ ను పోలీసులు పట్టుకున్నారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు క్యారెక్టర్స్ లో కళ్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. ఇక ట్రైలర్ లో ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ హైలైట్ గా నిలిచింది. గిబ్రాన్ సంగీతం ఆకట్టుకొంటుంది. మొత్తానికి కొత్త ప్రయత్నం ఫలించేలా ఉందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలంటే ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే.