Mega 156 Director Update: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డే జరుపుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. అలాంటి మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా 156 సినిమాను ఈరోజు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ మెగా 156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల భారీ ఎత్తున నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగా 156 రూపొందనుండగా త్వరలోనే చిత్ర దర్శకుడిని అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే మెగా 156 స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు.
Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో ఆరోజు జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్
అయితే ఆయన ప్లేస్ లో మురుగదాస్ ను రంగంలోకి దించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఇక ఇటీవల దయా వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేనిని కూడా కన్సిడర్ చేస్తున్నారని అంటున్నారు, గతంలో ఆయన ఆహా సినిమా సేనాపతి కోసం గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో కలిసి పని చేశారు. ‘నాలుగు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, భావోద్వేగాలను కలిగించే అపారమైన వ్యక్తిత్వం, తెరపైన, బయట పండగ లాంటి వ్యక్తి, 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 మెగారాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది, చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారని చెబుతున్నారు.