భోళా శంకర్ సినిమాతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసాడు. మెగాస్టార్ పై ముందెన్నడూ లేనంత ట్రోలింగ్ కి కారణం అయ్యింది భోళా శంకర్ సినిమా. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి చిరుపై విమర్శలు మొదలయ్యాయి. హిట్-ఫ్లాప్ అనేది పక్కన పెడితే చిరు అనే పేరు రిజల్ట్ కి సంబంధించినది కాదు. ఆయన పేరు కొన్ని కోట్ల మందికి ఒక ఎమోషన్. ఒక్క ఫ్లాప్ మూడున్నర దశాబ్దాలుగా చిరు సృష్టించిన ఈ మెగా సామ్రాజ్యాన్ని కూల్చేయగలదా? అసంభవం అన్నయ్య తిరిగొస్తాడు, విమర్శించిన ప్రతి నోరుని మూపిస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్లకి కౌంటర్లు వేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే చిరు బర్త్ డేన ఆగస్టు 22న కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తుందనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలతో అక్కినేని ఫ్యామిలీకి హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా ఉండే చాన్సు ఉందని టాక్. దాదాపు అఫీషియల్ గా అనౌన్స్ అవ్వడమే లేట్ అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లో భారీ మార్పులు జరగనున్నాయని సమాచారం.
కళ్యాణ్ కృష్ణ స్థానంలో మురుగదాస్ మెగాస్టార్ ని డైరక్ట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నాడట. ఠాగూర్ లాంటి కథతో చిరుకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు మురుగదాస్. చిరు పదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ సమయంలో కూడా మురుగదాస్ రాసిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమానే చేసాడు. ఈ రెండు సినిమాలకి మురుగదాస్ కథని అందిస్తే వినాయక్ డైరెక్ట్ చేసాడు. అయితే స్టాలిన్ సినిమాతో చిరుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు మురుగదాస్. ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ కూడా ఇచ్చిన మురుగదాస్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఫేజ్ ని పక్కన పెడితే శంకర్ తర్వాత ఆ రేంజ్ సోషల్ కాజ్ అండ్ కమర్షియల్ సినిమాలకి కలిపి హిట్స్ కొట్టే దర్శకుడు మురుగదాస్ మాత్రమే. ఇలాంటి దర్శకుడికి కాస్త టైమ్ ఇచ్చి, మంచి టీమ్ ఇస్తే ఎప్పుడైనా ఇండస్ట్రీ హిట్ ఇవ్వగల సమర్థుడే. ఇప్పుడు చిరుకి మురుగదాస్ తోడైతే ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా పడడం గ్యారెంటీ. మురుగదాస్ డైరెక్షన్, జీవీ ప్రకాష్ మ్యూజిక్ అంటూ చిరు సినిమాపై కొత్తగా వినిపిస్తున్న వార్తలో నిజమంటే మాత్రం ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని కంబ్యాక్ ని చిరు చూపించడం గ్యారెంటీ.