Lambasingi grand release on March 15th in theaters : సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు ధీటుగా ఆంధ్రలో కూడా ఒక హిల్ స్టేషన్ ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యిన దాని పేరు ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది టాగ్ లైన్.
Mahesh Babu: కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లులా ఉంటాయి
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. జావేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా డిఫరెంట్ మెలోడీతో సాగిన ఈ సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.