RGV Slams Pawan Kalyan : ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో విజయవాడ ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పవన్ కామెంట్స్ కి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఏం భ్రష్టు పట్టించాడో పవన్ స్పష్టంగా చెప్పాలి అని ప్రశ్నించిన ఆయన పవన్ చేసే ఏ విమర్శకు ఆధారాలు ఉండవని అన్నారు. ఆధారాలు ఏవని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అడగరు అని పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ పవన్ చేసే వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ అర్థం కావని అన్నారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నామని అన్నారు.
Mahesh Babu: గ్యాప్ రాలేదు.. షూట్ లో బిజీ బిజీగా మహేష్
అలాగే ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్ ను సినిమా విడుదల చేస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే సైకో…బాబాయ్ ను చంపేశాడని జగన్ ను విమర్శిస్తాడు కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సేవకోసం వచ్చిన వ్యక్తి అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పై మేం ఎక్కడైనా చర్చకు సిద్ధం అని పేర్కొన్న గౌతమ్ రెడ్డి. జగన్ ను విమర్శించడమంటే సూర్యుడి పై ఉమ్మివేయడమేనని పవన్ గుర్తించాలని అన్నారు. ఈ క్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కళ్ల ముందు జరుగుతున్న విషయాలను వ్యూహం,శపథం సినిమాలుగా తెరకెక్కించామని అన్నారు. ఈ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు సృష్టించారని, సినిమా చేసినప్పుడే శపథం పేరుతో వెబ్ సిరీస్ కూడా చేశామని అన్నారు. శపథం ఆరంభం ఛాప్టర్ 1 ఈ సాయంత్రం 8 గంటలకు ఓటీటీలో విడుదల చేస్తాం, శపథం అంతం ఛాప్టర్ 2 రేపు సాయంత్రం 8 గంటలకు ఓటీటీలో విడుదల చేస్తామని అన్నారు.