Kalki 2898 AD Seeks Permission to Hike Ticket Rates:’కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా మీద ప్రేక్షలులకు అనుమానాలు కలుగకుండా నాగ్ అశ్విన్ విభిన్నంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడం కోసం టీం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరినట్టు తెలుస్తోంది.
Renu Desai: నేను దురదృష్టవంతురాలినా? ఆ మాట ఎంతో బాధిస్తోంది… రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
ఆంధ్రలో మల్టీ ప్లెక్స్, సింగిల్ థియేటర్ అనే తేడాలేకుండా వంద అదనంగా పెంచి అమ్ముకునేలా అనుమతులు కోరింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక మల్టీ ప్లెక్స్ 75, సింగిల్ థియేటర్ 100 వంతున అదనపు రేట్ల కోసం దరఖాస్తు చేశారు. అంతేకాదు తెల్లవారుఝామున 5 గంటల ఆట కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. తెలంగాలో కాంగ్రెస్ ఏపీలో కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం సినిమా రంగం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్న క్రమంలో రేట్లు పెంచుకోవడనికి అనుమతులు రావడం దాదాపు ఖాయం అనే అంటున్నారు.