Kajal Aggarwal Plays A Significant Role In Vishnu Manchu’s Kannappa: మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించగా, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమంటే కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు సినిమా యూనిట్ ఆమెను స్వాగతిస్తూ రిలీజ్ చేసిన అప్డేట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే.
Jr NTR: స్థల వివాదంలో ట్విస్ట్.. ఎన్టీఆర్ కు సంబంధమే లేదట!
ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప సినిమాలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఏమిటి అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాదలో జరుగుతోంది. ఇక మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.