New Twist in Jr NTR Land Dispute Case: హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించినట్లు ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును తారక్ ఆశ్రయించాడని వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం రేగింది. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుండి ప్లాట్ ను ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్టగేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ పొందారని, 3 నుండి 4 బ్యాంక్ ల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ పొందినట్లు వార్తలు వచ్చాయి.
Puri Jagannadh : హనుమాన్ హీరోకు పూరీ బంపర్ ఆఫర్..?
జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టిన గీతాలక్ష్మి, ఐదు బ్యాంకుల నుంచి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందినట్లు తేలింది ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో వెల్లడించినట్లు తేలింది. చెన్నై లో ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఓనర్ గా ఉన్న తారక్ కి అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతున్నదని వార్తలు వచ్చాయి.
ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్న క్రమంలో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు చేయగా 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ కూడా వేశారని తాజాగా DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేసినట్టు ఈ ఉదయం వార్తలు వచ్చాయి. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు పేర్కొంటూ జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద ఎన్టీఆర్ టీం స్పందించింది. ఎన్టీఆర్‌కు సంబంధించి ఈరోజు ప్రచురితమైన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు. ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్ విక్రయించారని మేము స్పష్టం చేయాలనుకుంటున్నామని, ఎటువంటి రిపోర్టింగ్‌లో శ్రీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించకుండా ఉండమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని కోరారు.