సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులోను సూపర్ స్టార్ కు భారీ మార్కెట్ ఉంటుంది. జైలర్ తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రజనీ కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేశ్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ ధర రూ. 50 కోట్లకు ఏషియన్ సునీల్ కొనుగోలు చేసారు.
Also Read : Kareena : పాతికేళ్ల సినీ ప్రయాణం.. అవమానాల నుండి అగ్రస్థానం వరకు
ఇక టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రూ. 90 కోట్లకు కొనుగోలు చేసారు. డబ్బింగ్ సినిమాలలోనే అత్యధిక పలికిన సినిమాగా వార్ 2 నిలిచింది. ఆగస్టు 14న విడుదలవుతన్నకూలీకి వార్ కు మధ్య పోటీ నెలకొంది. కూలీలో రజనీ, అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి హేమాహేమీలు ఉన్నారు. కానీ వార్ 2 లో ఎన్టీఆర్ మరియు హృతిక్ మాత్రమే ఉన్నారు. దర్శకుడు కూడా ఇక్కడి వారికీ అంతగా పరిచయం లేని వాడే. కానీ వార్ 2 కు అంత ధర పలికిందంటే అందుకు కారణం NTR అనే పేరు మాత్రమే. తన అశేషమైన ఫ్యాన్ బేస్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం మించి స్టార్ డమ్ సాధించిన యంగ్ టైగర్ వార్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.