బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఇయర్స్ కంప్లీటయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది బెబో. రెఫ్యూజీ అనే మూవీతో తెరంగేట్రం చేసింది కరీనా. ఈ 25 ఏళ్లల్లో స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో అక్క కరిష్మాతో పోల్చి చూస్తూ ఆమె నటనకు వంకలు పెట్టిన ప్రేక్షకులు ఆ తర్వాత కరీనా స్ట్రిప్ట్ సెలక్షన్, యాక్టింగ్‍కు ఫిదా అయిపోయారు.
కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త బొద్దుగా కనిపించిన కరీనా.. ఫిట్ నెస్‌పై కాన్సట్రేషన్ చేసి జీరో సైజ్‌కు మారింది. తర్వాత కూడా ఫిజిక్ అలాగే మెయిన్ టైన్ చేస్తూ జీరో సైజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఛేంజ్ అయ్యింది. అలాగే కెరీర్ పీక్స్‌లో ఉండగానే సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిట్ నెస్ మెయిన్ టైన్ చేస్తూ ఛాన్సులు కొల్లగొట్టడంలో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. పెళ్లై, పిల్లలున్నా కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతుండటం బహూశా కరీనాకు చెల్లుతుందేమో. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అందులోనూ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తోంది కరీనా. లాస్ట్ 10 చిత్రాల నుండి చూస్తే ఆమె సక్సెస్ రెష్యో 60 ఎబైవ్ ఉంది. 45 ప్లస్‌లోకి ఎంటరౌతున్న బెబో ప్రజెంట్ అచితూచి సినిమాలు చేస్తోంది. ప్రజెంట్ వీర్ ది వెడ్డింగ్ 2తో పాటు తక్త్, మేఘన గుల్జార్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిటయ్యింది. అలాగే అక్క టచ్ చేయని సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతుందని టాక్. ఇప్పటికే సైఫ్ దేవరతో టాలీవుడ్‌లోకి ఎంటరైతే కరీనా కూడా ఇటు వైపుగా ఇంట్రస్ట్ చూపిస్తోందని సమాచారం.