JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిరంజీవి, బాలకృష్ణ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించగా.. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ భారీ హిట్ అయింది. ఈ మూవీ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి అలరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ, చిరంజీవి మీద స్పందించారు. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలిపాడు.
Read Also : India-Pakistan War: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్..
‘నాటు నాటు’ సాంగ్ లో చిరంజీవి, బాలకృష్ణ కలిసి డ్యాన్స్ చేస్తే అది గొప్ప జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది. వారిద్దరూ బెస్ట్ డ్యాన్సర్లు. రామ్ చరణ్ కూడా మంచి డ్యాన్సర్. నేను కూడా డ్యాన్స్ బాగా చేస్తా. అందుకే ఆ సాంగ్ బాగా కలిసి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుని ఇద్దరూ అలరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.