నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అన్నదమ్ములు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అప్సెట్ అయ్యారు అనే విషయం తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ ఒక్కసారి బయటకి వచ్చి మాట్లాడు అన్న అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అన్న, మాట్లాడు అంటూ ఎన్టీఆర్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా అడుగుతున్న వారితో పాటు అసలు రాజకీయాలు మనకి వద్దు, సినిమాలు చేసుకో చాలు అని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నిన్ను మొదటి నుంచి దగ్గరికి రానివ్వలేదు, ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్. ఎవరు ఎలాంటి ఆలోచనలు చేసినా ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర షూటింగ్ షార్ట్ బ్రేక్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మొదలుపెట్టాడు. 2024 ఏప్రిల్ 5 రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకోని దేవర షూటింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్, అందుకే రాజకీయాల గురించి పట్టించుకోవట్లేదేమో.