నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అన్నదమ్ములు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియదు…