July 2023 Tollywood Releases: రంగబలి, భాగ్ సాలే, బ్రో సహా ఈ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
July 2023 Tollywood Releases: జూలై నెలలో థియేటర్లలో సందడి చేసేందుకు పలువురు టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్, నాగశౌర్య, ఆనంద్ దేవరకొండ మాత్రమే కాకుండా వారితో పాటు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ తో పాటు మరికొందరు తమిళ హీరోలు సైతం తమ సినిమాలతో జూలై నెలలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జూలై రిలీజ్ కానున్న తెలుగు సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి మూవీ జూలై 7న రిలీజ్ కానుంది. మొట్టమొదటి సారిగాఔట్ అండ్ ఔట్ మాస్ కథాంశంతో నాగశౌర్య చేసిన ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇక అదే రోజున కీరవాణి కొడుకు శ్రీసింహాకోడూరి హీరోగా క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన భాగ్‌సాలే కూడా థియేటర్లలోకి రాబోతోంది. షార్ట్ ఫిలిం మేకర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం హిస్తోన్న ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తోంది.
Shirley Setia: వింత డ్రెస్సులో షిర్లే షెటియా అందాలు.. దాచినా దాగట్లేదు!
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ఇక అదే రోజున జగపతిబాబు రుద్రంగి మూవీ కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించడం బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళడంతో ఆసక్తి ఏర్పడింది. ఇక ఇవేకాక నీలకంఠ సర్కిల్, మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్, ఓ సాథియా సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోన్న 7:11 PM సినిమాలు విడుదలకానున్నాయి. ఇక రెండో వారంలో ఆనంద్ దేవరకొండ బేబీ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించబోతున్నాడు . సాయి రాజేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుండగా సినిమాలో విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ డబ్బింగ్ మూవీ మహావీరుడు(మహావీరన్) కూడా అదే రోజు థియేటర్లలో విడుదలకానుంది.
అలాగే దిల్‌రాజు తెలుగులో రిలీజ్ చేస్తోన్న వాలాట్టి అనే మలయాళ డబ్బింగ్ మూవీ కూడా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక జూలై మూడో వారంలో బిచ్చగాడు -2 సక్సెస్ తర్వాత జూలై 21న హత్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ ఆంటోనీ. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతుండగా బాలాజీ కుమార్ డైరెక్ట్ చేశాడు, ఇక అదే రోజున చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన అన్నపూర్ణ ఫొటో స్టూడియో కూడా జూలై 21న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా పీరియాడికల్ లవ్‌స్టోరీగా చెందు ముద్దు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో మూవీ జూలై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.
- Tags
- baby
- Bhaag Saale
- bro
- Hatya
- Rangabali
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!