July 2023 Tollywood Releases: జూలై నెలలో థియేటర్లలో సందడి చేసేందుకు పలువురు టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్, నాగశౌర్య, ఆనంద్ దేవరకొండ మాత్రమే కాకుండా వారితో పాటు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ తో పాటు మరికొందరు తమిళ హీరోలు సైతం తమ సినిమాలతో జూలై నెలలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. జూలై రిలీజ్ కానున్న తెలుగు సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా నాగశౌర్య హీరోగా నటించిన…
Vijay Antony: బిచ్చగాడు 2 తో ఈ ఏడాది సెన్సేషన్ సృష్టించాడు కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. భారీ విజయాన్ని అందుకొని రికార్డులను కొల్లగొట్టింది. విజయ్ ఆంటోనీ పేరు తెలుగులో చాలాకాలం వినిపించేలా చేసిన సినిమా బిచ్చగాడు. ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ నుంచి వస్తున్న మరో చిత్రం హత్య.
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.…
విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన…