ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పై భారీ హైప్ ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ.. ‘డ్రాగన్’ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు తారక్. ఆ మధ్యన ఆయన లీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరీ ఇంత చిక్కిపోయాడేంటి? అని అనుకున్నారు. దానికి తోడు ఎన్టీఆర్-నీల్ మధ్య మనస్పర్థలు అనే న్యూస్ అభిమానులను కాస్త టెన్షన్ పెట్టేసింది. ఫైనల్‌గా ఇప్పుడు అన్ని సెట్ చేసుకొని కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతోంది చిత్ర యూనిట్.
Also Read: Travis Head Record: 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఏళ్ల నాటి రికార్డులు బ్రేక్!
రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ దగ్గరుండి మరీ ఎన్టీఆర్ లుక్ రెడీ చేస్తున్న ఫోటో బయటికి రాగా.. అన్ని పుకార్లకు చెక్ పడింది. అయితే, లేటెస్ట్‌గా ఎన్టీఆర్ ఫోటోలు బయటికి రాగా… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది. రఫ్ గడ్డంతో ఊర మాస్ కటౌట్‌తో కినినిస్తున్నారు. దీంతో నెక్స్ట్ షెడ్యూల్‌లో డ్రాగన్ లుక్ ఇదే అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే లుక్ మారుతున్నట్టుగా సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఉంటాయి. డ్రాగన్ కూడా అంతకుమించి అనేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా.. ఈ సినిమాలో టైగర్ రగ్గడ్ లుక్ మాత్రం కేక పుట్టించేలా ఉంటుందని టాక్. ఇప్పటి వరకు బయటికొచ్చిన లుక్స్ కూడా అదే చెబుతున్నాయి. ఏదేమైనా డ్రాగన్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.