War 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్-2 ఆగస్టు 14న వస్తోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనలో నన్ను నేను చూసుకునేవాడిని. అతను ప్రతి రోజూ సెట్స్ కు వచ్చాక నేర్చుకుంటాడు. అదే హృతిక్ రోషన్ అంటే. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని ఉంది సినిమాతో రామోజీ రావు నన్ను పరిచయం చేశారు. ఆ రోజు నా పక్కన నాన్న, అమ్మ తప్ప ఎవరూ లేరు. నా భవిష్యత్ ఎలా ఉంటుందో నాకే తెలియదు.
Read Also : WAR 2 Pre Release Event : ఇండియాలో గ్రేట్ డ్యాన్సర్ అతనే.. ఎన్టీఆర్ కితాబు
ఆ రోజు అధోనీ నుంచి ముజీబ్ మొట్టమొదటి అభిమాని నాకు. అతను నా ఫ్యాన్ అంటూ నా వద్దకు వచ్చాడు. ఆ తర్వాత చాలా మంది నాతో నడుచుకుంటూ వచ్చారు. ఈ రోజు ఇక్కడి దాకా వచ్చాను. వీటన్నింటికీ కారణం నా తండ్రి, మా అమ్మ శాలిని, మా అన్నలు కల్యాణ్ రామ్, జానకి రామ్. వీరితో పాటు నిర్మాతలు, దర్శకులు అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా నా తాత ఎన్టీఆర్ ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా అభిమానుల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను. నా తండ్రి నాకు జన్మనిచ్చారు. కానీ నా జన్మ మీకే సొంతం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటా. అందరికీ థాంక్స్. ఈ సినిమా అదిరిపోయింది. ఎవరి మాటలు నమ్మొద్దు. సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ తెలిపాడు ఎన్టీఆర్.
Read Also : WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు