WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో హృతిక్ రోషన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు. అప్పుడు క్రిష్ సినిమా కోసం ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. నాలుగు రోజుల్లో వార్-2 వస్తోంది. యుద్ధానికి రెడీనా. తారక్ తో నటించడం స్టార్ట్ చేసినప్పుడే మేమిద్దరం నిజమైన బ్రదర్స్ లా కలిసి ఉండటం మొదలు పెట్టాం. మీరందరూ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. నేను కూడ మీకు ప్రామిస్ ఇస్తున్నాను. మీరందరూ నా తమ్ముడిని ఎప్పటికీ ఇలాగే ప్రేమించాలి. నా కెరీర్ లోనే వార్-2 టాప్ ప్లేస్ లో ఉంటుంది అంటూ చెప్పారు.
Read Also : WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
హృతిక్ మాట్లాడుతూ.. ‘నాకు ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇందులో ఎన్నో యాక్షన్, ఎమోషన్ సీన్లు ఉన్నాయి. కహోనా ప్యార్ హై, క్రిష్ సినిమాలు చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో కబీర్ పాత్ర చేసినప్పుడు అంతే వచ్చింది. ఈ మూవీ కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఎవరూ మిస్ అవ్వొద్దు. యాక్షన్ సీన్లలో ఎన్నో గాయాలు అయ్యాయి. నేను గాయాలు అయితే వెంటనే కోలుకోలేను. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్. వెంటనే నేను ఓకే అంటాడు. ఎన్టీఆర్ ను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించేది. నేను సినిమా షూటింగ్ టైమ్ లో గాయాలు అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అనుకునే వాడిని. కానీ ఇప్పుడు మీ ప్రేమను చూస్తుంటే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తోంది అంటూ తెలిపారు.
‘తారక్ ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోంది. తారక్ కూడా నా లాగే కష్టపడుతాడు. ఒక్క టేక్ లోనే సీన్ కంప్లీట్ చేస్తాడు. అతను వన్ టేక్ యాక్టర్. నేను తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాట్ కు ఎలా వెళ్లాలో ఎన్టీఆర్ ను చూసి వందశాతం నేర్చుకున్నాను. అతను నటించిన షాట్ ను ఎవరూ నిర్ణయించక్కర్లేదు. అతను సీన్ కోసం వందశాతం ఎఫర్ట్ పెడుతాడు. నేను ఫ్యూచర్ లో చేసే సినిమాల్లో తారక్ లాగా ఎఫర్ట్ పెడతా. తారక్ యాక్టర్ మాత్రమే కాదు. అతను బెస్ట్ షెఫ్. తారక్ నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మనం తర్వాత సినిమాలు చేసినా చేయకపోయినా పర్లేదు. కానీ నువ్వు నాకు ఎప్పటికీ బిర్యానీ వండి పెట్టాలి చెప్పుకొచ్చాడు హృతిక్.
Read Also : War 2 Pre Release Event : వార్-2 పక్కా తెలుగు సినిమానే.. డబ్బింగ్ కాదు : నాగవంశీ