JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇబ్బంది పడుతూ కనిపించాడు.
Read Also : Niharika : ప్రజెంట్ వేరుగా ఉంటున్నా.. నిహారిక కామెంట్స్
కుడి చేయి ఛాతి కింద తరచూ ఎడమ చేయి పెట్టుకుంటూ కనిపించాడు. కూర్చునేటప్పుడు కూడా ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ కు అంత ఇబ్బంది ఉన్నా సరే రిషబ్ శెట్టి కోసం వచ్చాడని చెబుతున్నారు. ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలతోనే రిషబ్ శెట్టి సినిమా చేయడం చూసి షాక్ అయ్యానని.. ఇలాంటి సినిమా చేయడం కేవలం రిషబ్ కు మాత్రమే సాధ్యం అయిందన్నాడు.
Read Also : Kanthara -1 : డబ్బింగ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపా.. ఏంటీ దారుణం