Kanthara -1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 పై మంచి అంచనాలున్నాయి. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ వెఠ్టి హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం తెలుగులో బడా సంస్థలు దిగాయి. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో గీతా ఆర్ట్స్ బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ ఈ డబ్బింగ్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందంట. ఈ పెంపు అవసరమా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే తెలుగు సినిమాలకు టికెట్ రేట్లు పెంచితేనే పెద్ద రచ్చ జరుగుతోంది.
Read Also : Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
ఫ్యాన్స్ ను దోచుకుంటున్నారనే విమర్శలు తెలుగులో స్టార్ హీరోలకు కూడా తప్పట్లేదు. అలాంటిది డబ్బింగ్ మూవీ అయిన కాంతార-1 కి కూడా కావాలంటే ఎలా. అంటే తెలుగు ప్రేక్షకులు మరీ అంత దారుణంగా కనిపిస్తున్నారా. అసలే టికెట్ రేట్లు పెంచితే తెలుగు హీరోల సినిమాలకు కూడా థియేటర్లలో ఆదరణ కనిపించట్లేదు. అలాంటిది కన్నడ సినిమాలకు కూడా ఇక్కడ పెంచడం ఏంటి. మన తెలుగు సినిమాలకు అక్కడ ఏమైనా పెంచుతున్నారా. మొన్నటికి మొన్న ఓజీ సినిమాకు తెలంగాణలో రేట్లు పెంచితే ఏకంగా హైకోర్టుకు వెళ్లి మరీ మెమోను సస్పెండ్ చేయించారు. అలాంటిది కన్నడ సినిమాకు పెంచితే ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో విమర్శలు వస్తాయో ఒకసారి ఆలోచించాలి.
Read Also : Kayadu Lohar : విజయ్ ఎంత మందిని బలితీసుకుంటావ్.. ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్