Joruga Husharuga: బేబీ బాయ్ ఫ్రెండ్ విరాట్.. జోరుగా హుషారుగా వస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joruga Husharuga: బేబి చిత్రంలో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్.. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత నిరీష్ తిరువిధుల. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. “యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది.. సినిమాలో అందర్ని ఆకట్టుకునే వినోదం కూడా వుంది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నాం” అన్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
దర్శకుడు మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు. మరి ఈ సినిమాతో విరాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!