జెన్నిఫర్ లోపెజ్.. ఏ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. అమెరికన్ పాప్ సింగర్, నటిగా ప్రపంచమంతా అమ్మడు పేరు మారుమ్రోగుతోంది. ఇక పాటలతో పాటు అమ్మడు ప్రేమ, పెళ్లిళ్లతో కూడా పాపులర్ అయ్యింది. ఇప్పటికే జెన్నిఫర్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అవి పెటాకులు అవ్వడం తెలిసిందే. ఇక తాజాగా ఈ బ్యూటీ నాలుగో పెళ్లికి సిద్దమవుతుంది. ఇక తాజాగా నటుడు బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ తన తదుపరి చిత్రం ‘మ్యారీ మీ’ ప్రమోషనల్లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
మీరు బెన్ అఫ్లెక్ ని వివాహం చేసుకుంటారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా ” అవును.. నేను తనని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను.. మీకు తెలుసు .. ఇదివరకే నాకు కొన్నిసార్లు వివాహం అయ్యింది.. నేను చాలా రొమాంటిక్ .. అందుకే ఇంకోసారి వివాహానికి రెడీ అవుతున్నా.. మరో పెళ్లి తర్వాత కూడా నేను సంతోషంగా ఉంటానని 100 శాతం నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సింగర్ హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.