ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’ పై భిన్నమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ..
Also Read : Rashmika Mandanna : అబ్బాయిలకూ పీరియడ్స్ వస్తే బాగుండేది.. మా నొప్పి ఏంటో తెలిసేది!
“ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. ఇందులో వచ్చే ధన పిశాచి సీక్వెన్స్‌లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక అంశాలు, బ్లాక్ మ్యాజిక్, కుటుంబ భావోద్వేగాలను మిళితం చేసిన యూనిక్ స్టోరీ ఇది. కథలో అనంత పద్మనాభ స్వామి ఆలయం స్ఫూర్తిగా నిలిచింది. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. విజువల్ ప్రెజెంటేషన్ విషయంలో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతి లభిస్తుంది,” అని చెప్పారు. మొత్తనికి భక్తి, మిస్టరీ, ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కిన ‘జటాధర’ సినిమాపై ఇప్పటికే ట్రైలర్, పోస్టర్ మంచి బజ్ సృష్టించాయి.